సత్యసాయి జిల్లా రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో ఆదివారం ఐదున్నర గంటల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రామగిరి చెన్నై కొత్తపల్లి కనగానపల్లి మండలాలకు చెందిన 37 మందికి 32 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందని గత 18 నెలలోనే రాప్తాడు ధర్మవరం నియోజకవర్గం చెందిన 857 మందికి ఏడు కోట్ల 50 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్బిదారులకు అందజేయడం జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.