డోన్: బేతంచెర్ల లో పాముకాటుతో మహిళ మృతి
Dhone, Nandyal | Jun 10, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్లలోని ఓ పాలిష్ ఫ్యాక్టరీలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సుకుర్ ముని గోప్ (19) అనే వివాహిత పాము కాటుతో మృతి చెందారు. ఉపాధి నిమిత్తం గోషా గోప్, సుకుర్ ముని గోప్ దంపతులు ఆరు నెలల క్రితం బేతంచెర్లకు వచ్చి ఫ్యాక్టరీలో పని చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఆమె పాము కాటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానిక PHCకి తరలించే లోపే ఆమె ప్రాణాలు విడిచారని స్థానికులు తెలిపారు.