కోడుమూరు: ఎర్రదొడ్డి పంచాయతీలో ఇంటింటి చెత్త సేకరణ పై ఎంపీడీవో రాముడు తనిఖీ
కోడుమూరు ఎంపీడీవో రాముడు మంగళవారం ఎర్రదొడ్డి పంచాయతీలో ఇంటింటి చెత్త సేకరణ కార్యక్రమాలపై పంచాయతీ కార్యదర్శి, గ్రీన్ అంబాసిడర్లకు పలు సూచనలు చేశారు. ఎర్రదొడ్డి, చిల్లబండ గ్రామాల్లో ఇంటింటి దగ్గర చెత్త సేకరణ కచ్చితంగా జరగాలని, ఐవిఆర్ఎస్ కాల్స్ పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్ డబ్ల్యూ పి సి షెడ్యూల్ వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.