బనగానపల్లె: బనగానపల్లెలో ప్రారంభమైన మొహరం వేడుకలు,పాల్గొన్న మంత్రి కలెక్టర్
బనగానపల్లెలో హజరత్ అబ్బాస్ అలీ పీర్ల చావిడిలో ప్రభుత్వ లాంఛనాలతో ప్రారంభమైన మొహర్రం వేడుకల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి గణియా పాల్గొన్నారు. వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మైనార్టీ సోదరులతో కలిసి పాదయాత్రగా ఆస్థానానికి చేరుకుని పూల షేరా దట్టీ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.