ఘన్‌పూర్: నిరుపేదల సంక్షేమం కోసం ఇందిరా గాంధీ చేసిన కృషి ఎంతో ఉంది ఎక్సైజ్ శాఖ మంత్రి
వనపర్తి నియోజకవర్గం ఘనపురం మండలం సల్కెలాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు స్వాతంత్రం వచ్చిన నాటి నుండి దాదాపు 64 సంవత్సరాల కాలం పాటు నిరుపేదల సంక్షేమం కోసం కృషి చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. నిరుపేదల సంక్షేమం కోసం ఇందిరాగాంధీ ఆశయాల లక్ష్యసాధనలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభలలో ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరాగాంధీ ఆత్మ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు నిరుపేద ప్రజలకు చేరాలనే లక్ష్యంతోనే గ్రామసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు.