అన్నమయ్య జిల్లాలో నేరస్తులకు దాక్కునే చోటులేమీ మిగలని తరహాలో పోలీసులు నిఘాను పెంచారు. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాలతో ‘డ్రోన్ సర్వైలెన్స్’ వ్యవస్థను శివారు ప్రాంతాలు, పొలిమేరలు, సున్నిత ప్రాంతాల్లో అమల్లోకి తెచ్చారు.గంజాయి విక్రయాలు, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, పేకాట, కోడి పందాలు వంటి అనైతిక కార్యకలాపాలను డ్రోన్లు నేరుగా కెమెరాలో రికార్డ్ చేసి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు చేరవేస్తున్నాయి. చీకటి, నిర్మానుష్య ప్రదేశాలు, పాడుబడిన ఇళ్లలో జరుగుతున్న అక్రమాలకు డ్రోన్లు అడ్డుకట్ట వేస్తున్నాయిట్రాఫిక్ ఉల్లంఘనలకూ కఠిన చర్యలు