కొత్తగూడెం: ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలంటూ పాల్వంచ పట్టణంలోని అనుబోస్ కేఎల్ఆర్ కళాశాల సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన
తెలంగాణలో విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలనే డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల్లో బంద్‌కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ అనుబోస్,కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలల సిబ్బంది నల్ల రిబ్బన్లు ధరించి నిరసన..ఈ సందర్భంగా అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ ప్రిన్సిపాల్ డా. రవి కుమార్ మాట్లాడుతూ, గత నాలుగు సంవత్సరాలుగా ఇంజనీరింగ్ కళాశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడం వల్ల కళాశాలల నిర్వహణ కష్టంగా మారిందని తెలిపారు.