ఉరవకొండ: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా పట్టణంలో వైస్సార్సీపీ ప్రజా ఉద్యమ ర్యాలీ
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ కేంద్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు వై విశ్వేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బుధవారం వైయస్సార్సీపి ప్రజా ఉద్యమ భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పార్క్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి ఎం ఆర్ ఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లి వినతిపత్రం అందజేసారు. ప్రజా ఉద్యమ ర్యాలీలో నియోజకవర్గంలోని బెలుగుప్ప, కూడేరు, వజ్రకరూర్, విడపనకల్లు ఉరవకొండ మండలాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.