ఒంగోలు అర్బన్: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేరువు చేయాలని కార్యకర్తలకు సూచించిన ఎమ్మెల్యే
Ongole Urban, Prakasam | May 15, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు శుక్రవారం కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం తో పాటు ప్రత్యేక కార్యక్రమాలలో పాల్గొన్నారు . మొదటిగా ఒంగోలు నగరంలోని A1 ఫంక్షన్ హల్ నందు ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ వారి CREDAI ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం బిల్డర్స్ అసోసియేషన్ ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొని ప్రత్యేకంగా ప్రసంగించారు.కార్యక్రమం అనంతరం ఒంగోలు నగరంలోని పార్టీ కార్యాలయం కు వచ్చిన ఎమ్మెల్యే స్థానిక నేతలు కార్యకర్తలతో సమావేశాలను ఏర్పాటు చేసి వారికి దానికి సంబంధించిన పలు అంశాలను చర్చించారు