కర్నూలు: సమాజంలో ఆడపిల్ల, మగపిల్ల వాడు అనే వివక్ష ఉండకూడదు: కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
ఆడపిల్లలకు చదువుకునే హక్కు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇవ్వాలన్నారు. శనివారం ఉదయం 12 గంటలు కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ బాలికా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాలికా విద్య ఏ విధంగా ఉంది అనే విషయాన్ని పరిశీలించడం జరిగిందన్నారు.. అక్షరాస్యత రేటు కూడా 100% ఉండాల్సింది జిల్లాలో 56 శాతమే ఉందన్నారు.. అక్షరాస్యత రేటు 100 శాతం తీసుకొని వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు..