డోన్: మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు తో మంచి స్నేహం : డోన్ ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Apr 23, 2026 ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఆయన నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తమ మధ్య మంచి స్నేహం ఉండేదని వారు గుర్తు చేసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు