శివపురం చెంచు గుడెంలో విద్యుత్ మరమ్మతులు చేస్తునగా ఒక్కసారిగా సరఫరా అయిన విద్యుత్తు. హెల్పర్ ఇబ్రహీం కు తీవ్ర గాయాలు
కొత్తపల్లి మండలం శివపురం చెంచుగూడెంలో విద్యుత్ మరమ్మత్తుల కోసం ఎల్సి తీసుకొని విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మత్తులు చేస్తుండగా, ఒక్కసారిగా విద్యుత్తు సరఫరా కావడంతో స్తంభం పైనుంచి హెల్పర్ షేక్ ఇబ్రహీం కిందపడి తీవ్ర గాయాలయ్యాయి.ఒళ్ళంతా కాలిపోయి గాయాలతో అల్లాడిపోయాడు.వెంటనే స్థానిక చెంచులు 108 వాహనంలో అతనిని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలియజేశారు. ఎల్సి తీసుకొని మరమ్మతులు చేస్తున్న విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంతో విద్యుత్ సరఫరా చేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలియజేశారు.