ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మహిళలకు శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమం, మహిళలకు స్మార్ట్ ఫోన్లలో డౌన్లోడ్ చేయించిన పోలీసులు
Ongole Urban, Prakasam | May 27, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మహిళలకు శక్తి యాప్ పై పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం పట్టణం లోని ప్రధాన సెంటర్లు బస్టాండ్ ఏరియాలో హాస్టల్స్ ప్రాంతాలలో మహిళలకు యాప్ పై అవగాహన కల్పించి వారి స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేయించారు. అత్యవసర సమయంలో మహిళలు ఈ యాప్ ద్వారా పోలీసులను సంప్రదించినట్లయితే వెంటనే పోలీసులు వారి వద్దకు చేరుకొని వారికి రక్షణ కల్పిస్తారని పోలీసులు తెలిపారు.