జమ్మికుంట: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న బిజెపిని తరిమికొట్టాలి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి శీలం అశోక్
జమ్మికుంట: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా బుధవారం ఉదయం పట్టణం లోని స్థానిక మోతకుల గూడెం చౌరస్తా నుండి గాంధీ చౌక్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.సీపీఎం మండల కార్యదర్శి శీలం అశోక్ మాట్లాడుతూ తెలంగాణ రైతంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించి రాజకీయంగా వాడుకోవాలని బిజెపి కుట్ర చేస్తుందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో స్వాతంత్ర ఉద్యమంలో ఈసమంత కూడా పాల్గొనని బీజేపీకి పోరాటాల గురించి ఏమి తెలుస్తుందని అని అన్నారు. పేద బడుగు బలహీన వర్గాలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు అందుకే అమరవీరుల ఆశయాలను సాధించేందుకు వారి ఆశయాలను కొనసాగించాలని అన్నారు.