తెనాలి: కొల్లిపర్ల రెండు స్కూటీలు ఢీకొని ఇద్దరికీ గాయాలు
Tenali, Guntur | Sep 14, 2025 గుంటూరు జిల్లా కొల్లిపరలో ఆదివారం రెండు స్కూటీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బెల్లం కొండకు చెందిన సందీప్ కు తీవ్ర గాయాలవ్వగా, తెనాలి యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి తీవ్రంగా గాయాలైన వ్యక్తిని కొల్లిపరలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనపై కొల్లిపర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.