నారాయణపేట్: ఈదురు గాలులకు బస్టాండ్ దగ్గర విరిగిపడిన చెట్టుకొమ్మ
నారాయణపేట జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంకాలం ఐదు గంటల సమయంలో కురిసిన భారీ వర్షానికి నారాయణపేట కొత్త బస్టాండ్ దగ్గర ఈదురు గాలులకు చెట్టు కొమ్మ విరిగి నేలపై పడినది. ప్రయాణికులు కాలి మార్గాన లోపలికి వెళ్లే మార్గంలో చెట్టు కొమ్మ విరిగి నేలపై పడినది. ఆ సమయంలో ప్రయాణికులు వర్షం కురుస్తున్నందున ప్రయాణికులు బస్టాండు లో తల దాచుకొని ఉన్నారు. అక్కడ ఎవరు లేనందున పెను ప్రమాదం తప్పినట్లు అయింది.