శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం బోర్డు నూతన సభ్యులుగా పదవులు పొందిన కోలా విశాలాక్షి ఆనంద్, దండి రాఘవయ్య పగడాల మురళిని నగరికి చెందిన జాతీయ కాపు సంఘం నాయకులు బుధవారం సన్మానించారు. వారు మాట్లాడుతూ.. నూతన కమిటీలో బలిజ కులానికి చెందిన వారిని సభ్యులుగా చేర్చింనందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు పాల్గొన్నారు.