బనగానపల్లె: సంజామలలో "స్వర్ణాంధ్ర -స్వచ్చంధ్ర "కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రా కార్యక్రమంలో భాగంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శనివారం సంజామలలో పర్యటించారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి గ్రామ పరిశుభ్రత, స్వచ్ఛతపై ర్యాలీ, ప్రతిజ్ఞ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని మంత్రి బీసీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రత తప్పనిసరి అని మంత్రి బీసీ సూచించారు.