అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. టిడిపి నాయకులు, సన్నిహితులతో కలిసి ఆయన బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయం లో ఆలయానికి వెళ్లారు. అధికారులు, అర్చకులు ఎమ్మెల్యేకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కార్తీక పౌర్ణమి సందర్భంగా దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని కార్తీక దీపం వెలిగించారు. అనంతరం అర్చకులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని, స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.