పుంగనూరు: ఎస్సీ హాస్టల్లో నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన బిజెపి నాయకులు.
చిత్తూరు జిల్లా. పుంగనూరు పట్టణంలో బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నరసింహులు ఆధ్వర్యంలో బిజెపి రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షులు అయూబ్ అలీ ఖాన్. ఎస్సీ హాస్టల్లో విద్యార్థులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా విద్యార్థులతో కేక్ కట్ చేయించి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మాట్లాడుతూ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో దేశంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. భారతదేశ ప్రఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుందన్నారు.