పలమనేరు: 12న మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం -వైసిపి పట్టణ అధ్యక్షుడు హేమంత్
పలమనేరు: వైసిపి పార్టీ కార్యాలయం నందు పట్టణ వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు హేమంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమం చేపట్టబోతున్నామన్నారు. గత ఎన్నికల్లో టిడిపికి మద్దతుగా నిలిచిన వాళ్ళు కూడా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. ఈనెల 12న జరిగే కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ రావాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.