హత్నూర: విధి నిర్వహణలో ఉద్యోగులకు బదిలీలు సహజం : హత్నూర ఏపిఎం రాజశేఖర్
విధి నిర్వహణలో ఉద్యోగులకు బదిలీలు సహజమని హత్నూర ఏపిఎం రాజశేఖర్ అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామ సీసీగా పనిచేసిన కిష్టయ్య బదిలీపై వెళ్తుండడంతో గ్రామ మహిళా సమైక్య సంఘం ఆధ్వర్యంలో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అలాగే నూతనంగా వచ్చిన ఏపీఎం రాజశేఖర్ సిసి సునీతల ను సన్మానించారు. ఈ సందర్భంగా ఏపీఎం రాజశేఖర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో చేసిన సేవలు గుర్తింపునిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య సంఘం అధ్యక్షురాలు హుస్నా బేగం, వివో ఏ మంజుల, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.