నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లా వ్యాప్తంగా వర్షం కోసం రైతుల ఎదురుచూపులు
Nandyal Urban, Nandyal | Jul 10, 2026
నంద్యాల జిల్లాలోని మండలలో వర్షం కోసం రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.గ్రామాల్లో అరటి,కంది, మినుము, పసుపు పలు పంటలు వేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ పంటలు సాగు చేసిన రైతన్నలు వర్షం కోసం ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అరటి తోటల్లో ఎరువులు వేసి పంటలు ఏపుగా పెరిగేందుకు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు సరిగ్గా కురువకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతునారు