అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేపిన దళితుడిపై ఎస్సై జులుం జిల్లా ఎస్పీ జగదీష్ సీరియస్
Anantapur Urban, Anantapur | Apr 21, 2026
అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేపిన దళితుడిపై అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం లోని పెద్దవడుగూరు మండలం కేంద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఎస్సై ఆంజనేయులు నిందితుడైన వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేయడం పట్ల జిల్లా ఎస్పీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం డీఎస్పీ స్థాయి అధికారులతో సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు ఆయన ఆదేశాలు జారీ చేశారు.