సంతనూతలపాడు: చీమకుర్తిలో 67 మంది లబ్ధిదారులకు రూ 42.90 లక్షలు విలువచేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే విజయ్ కుమార్
చీమకుర్తిలో సంతనూతలపాడు శాసనసభ్యులు బి ఎన్ విజయ్ కుమార్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా చీమకుర్తి మండలంలోని 25 గ్రామాలకు చెందిన 67 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరైన రూ.42.90 లక్షలు విలువచేసే చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్పొరేట్ వైద్యశాలల్లో చికిత్స పొందిన పేద రోగులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిధులను మంజూరు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.