అట్టహాసంగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి నామినేషన్ పర్వం... నామినేషన్ కు భారీగా తరలివచ్చిన టిడిపి శ్రేణులు...
పర్చూరు పట్టణం జనసంద్రంగా మారింది. ఏలూరి నామినేషన్ కు వేలాది మంది అభిమానులు భారీగా తరలివచ్చారు. డప్పులు, తీన్మార్లు, అభిమానుల కేరింతలతో బొమ్మల సెంటర్ మార్మోగిపోయింది. బాపట్ల జిల్లా, మార్టూరులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావు నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీతో పర్చూరుకు బయలుదేరారు. పర్చూరుకు చేరుకున్న ఆయన బొమ్మల సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. చేతకాని దుర్మార్గపు పాలనకు ప్రజలు చమర గీతం పడాలని పిలుపునిచ్చారు. రాబోయేది కూటమి ప్రభుత్వమని ఘంటాపథంగా చెప్పారు.