కావలి: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నీ ప్రశంసించిన కలెక్టర్ హిమాన్షు శుక్ల...
జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం జువ్వలదిన్నె, దగదర్తి ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కొన్ని ప్రణాళికల గురించి కలెక్టర్కు వివరించారు. ఎమ్మెల్యే చెప్పే తీరును చూసి కలెక్టర్ ఆశ్చర్యపోయారు. తాను ఎందరో ఎమ్మెల్యేలను చూశానని, కానీ ఇంతటి జ్ఞానం ఉన్న ఎమ్మెల్యేని చూడడం ఇదే మొదటిసారని కలెక్టర్ ప్రశంసించారు. ఒక IAS అధికారిలా ప్రణాళికలు ఇస్తున్నారని, ఇది చాలా గొప్ప విషయమని ఆయన అన్నారు. ఒక ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడతారా అని తాను షాక్ అయినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగింది.