రాజేంద్రనగర్: అత్తాపూర్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన జిహెచ్ఎంసి అధికారులు
అత్తాపూర్ అంబీయన్స్ ఫోర్ట్‌లోని అనుమతులు లేని అదనపు అంతస్తులు, సెట్‌బ్యాక్ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు ఉక్కుపాదం మోపారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి హెచ్చరించారు.