విశాఖపట్నం: టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బిచ్చగాడు మృతి, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి రాంనగర్లో బిచ్చగాడు మృతి చెందిన కేసు నమోదు అయింది రాంనగర్ సమీపంలోని హోటల్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పదంగా పడి ఉన్నట్లు పోలీసులు గుర్తించి అనంతరం స్థానికులు సహాయంతో చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు ఈ నెల 14వ తేదీ అతను మృతి చెందాడు. ఈనెల 14వ తేదీ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించుగా దర్యాప్తు నిమిత్తం కేసిన హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావుకు అప్పగించారు కాగా మృతి వివరాలు తెలిస్తే పోలీసులను సంప్రదించాలని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.