నంద్యాల జిల్లా రుద్రవరం మండలం చిలకలూరు గ్రామ సమీపంలో గుర్తు తెలియని మహిళ శవం లభ్యమైనట్లు ఎస్సై జయప్ప తెలిపారు, వివరాలకు వెళ్తే రుద్రవరం మండల పరిధిలోని చిలకలూరు గ్రామ సమీపంలోని పగిడి వాగు గట్టు వద్ద శనివారం మహిళా శవం గుర్తించామన్నారు, మహిళ వంటిపై నల్లపూసల దండ, ముక్కుపుడక, మెరూన్ రెడ్ కలర్ పైజామా డ్రస్సులు ఉన్నాయన్నారు, మహిళ వయసు సుమారు 30 నుంచి 40 సంవత్సరాలు ఉంటుందని ఎస్ఐ తెలిపారు.