సింగరకొండ క్షేత్రంలో ప్రసన్నాంజనేయ స్వామి వారికి పదివేల అరటి పండ్లతో పూజ
బాపట్ల జిల్లా అద్దంకి మండలం సింగరకొండ క్షేత్రంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామికి అమావాస్య సందర్భంగా ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఆలయ పూజారులు వేద పండితులు పదివేల అరటి పండ్లతో పూజలు చేశారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు కూడా నిర్వహించడం జరిగింది అనంతరం మహా నివేదన పంచ హారతులు ఇచ్చారు భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు.