ఒంగోలు అర్బన్: ఒంగోలు, మార్కాపురం ఎస్పీ కార్యాలయాలలో ఈనెల 15వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం: ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Ongole Urban, Prakasam | Jun 14, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు మార్కాపురం ఎస్పీ కార్యాలయాలలో జూన్ 15వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదివారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. మార్కాపురం జిల్లా ప్రాంతంలోని ప్రజలు మార్కాపురం ఎస్పీ కార్యాలయంలో ఒంగోలు పరిసర ప్రాంతాలలోని ప్రజలు ప్రకాశం జిల్లా కు చెందిన నియోజకవర్గాలకు చెందినవారు ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో అర్జీలు ఇవ్వవచ్చని ఎస్పీ తెలిపారు. వచ్చిన అర్జీలు అన్నిటిని పరిష్కరిస్తామని తెలిపారు.