బొబ్బేపల్లి గ్రామంలోని ఎర్ర మట్టి కుండ తవ్వకాలను శాశ్వతంగా ఆపాలని లేకపోతే ఎన్నికలు బహిష్కరిస్తామని హెచ్చరించిన ప్రజలు.
బాపట్ల జిల్లా మార్టూరు మండలంలోని బొబ్బేపల్లి గ్రామంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఎర్రమట్టి కొండను పాలకులు ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుండి గుత్తేదారులు, అధికారులు అండదండలతో వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు ఎర్రమట్టి కొండను తొలిచేస్తూ అక్రమార్చనకు పాల్పడుతున్నారు. అయితే గురువారం బొబ్బేపల్లి గ్రామానికి చెందిన నాయకులు, ప్రజలు కొండ వద్దకు చేరుకొని ఎర్ర మట్టి తవ్వకాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పంచాయతీ పరిధిలో ఉన్న ఎర్రమట్టి కొండ తవ్వకాలను శాశ్వతంగా ఆపాలని లేకుంటే ఎన్నికల పరిష్కరిస్తామని ఆరోపిస్తున్నారు.