నంద్యాల అర్బన్: నంద్యాలలో క్రైన్ ఢీకొని ఓ వృద్ధుడికి తీవ్ర గాయాలు
Nandyal Urban, Nandyal | Jun 30, 2026
నంద్యాల పట్టణంలోని చామకల్వ సెంటర్లో మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న ఓ వృద్ధుడిని వేగంగా వచ్చిన ప్రోక్లైన్ వాహనం ప్రమాదవశాత్తు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వృద్ధుడికి తీవ్ర గాయాలు కాగా, గమనించిన స్థానికులు వెంటనే 108 వాహనంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు