ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో ప్రజల వినతులు స్వీకరించిన,ఎమ్మెల్యే అఖిలప్రియ,కలెక్టర్ రాజకుమారి గునియా
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో శనివారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు,ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, జిల్లా కలెక్టర్ రాజకుమారి గునియా పాల్గొని ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. గ్రామాలు, పట్టణాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా, ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్ ప్రతి వినతిని శ్రద్ధగా పరిశీలించారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పెన్షన్లు, రెవెన్యూ, విద్యుత్ వంటి పలు సమస్యలపై స్పందిస్తూ, వాటిని త్వరితగతి