నంద్యాల అర్బన్: త్వరలో నంద్యాలకు వైయస్సార్ విగ్రహం : మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి
Nandyal Urban, Nandyal | Jun 19, 2026
నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహ ప్రతిష్ఠ కోసం ఏర్పాటు చేయనున్న విగ్రహ తయారీ పనులను మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి పరిశీలించారు. తెనాలిలోని ప్రముఖ శిల్ప కళాకారుడు కాటూరి వెంకటేశ్వరరావు కుమారుడు కాటూరి రవీంద్ర ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. త్వరలోనే నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని రవిచంద్ర కిశోర్ రెడ్డి పేర్కొన్నారు