మంత్రాలయం:పీపీపీ విధానాన్ని నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో సోమవారం కర్నూలులో జరిగే భారీ ర్యాలీని జయప్రదం చేయాలని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదివారం పిలుపునిచ్చారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్పరం చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ సేకరించిన కోటి సంతకాలను కేంద్ర పార్టీ కార్యాలయానికి తరలింపులో భాగంగా ర్యాలీ ఉంటుందన్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి వైసిపి నాయకులు కార్యకర్తలు భారీగా తరలిరావాలన్నారు.