*వాయు కాలుష్యంపై రైతుల ఆగ్రహం* అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని రాయంపల్లి వద్ద ఉన్న గవిసిద్దేశ్వర స్పాంజ్ ఐరన్ పరిశ్రమ వాయు కాలుష్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమ నుండి వెలువడే వాయు కాలుష్యం వల్ల నష్టపోతున్న ఆయుతపల్లి, 74 ఉడేగోళం, తదతర గ్రామాల రైతులు కాలుష్యంతో మసి బారిన మొక్కజొన్న పంట ఉత్పత్తులను తీసుకువచ్చి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉంచి దర్నా చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బైటాయించారు. పరిశ్రమ యాజమాన్యంపై కాలుష్య నియంత్రణ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు, తమ పంట ఉత్పత్తులు పాడుకాకుండా కాపాడాలని కోరారు.