నంద్యాల అర్బన్: నంద్యాల పట్టణ శివారులో గేదె అడ్డు రావడంతో పొలాల్లోకి దూసుకెళ్లిన ప్రైవేట్ ట్రావెల్స్, పలువురికి స్వల్ప గాయాలు
Nandyal Urban, Nandyal | May 9, 2026
నంద్యాల పట్టణ శివారులో మహానంది మండలం మసీదుపురం సమీపంలో గేదె అడ్డు రావడంతో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. హైదరాబాద్ నుంచి తిరువన్నామలైకి సుమారు 40 మంది ప్రయాణికులతో వెళ్తుండగా శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులోని పలువురు ప్రయాణికులకు గాయాలైనట్లు తెలుస్తోంది.