తాళ్ళరేవు: చొల్లంగిపేట డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని షర్మిల పదవ తరగతులు ప్రతిభ.
తాళ్ళరేవు మండలం పరిధిలోని చొల్లంగి పేట డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో చదువుతున్న గోవాలంక గ్రామానికి చెందిన విద్యార్థిని కురాటి పూర్ణ షర్మిల 565 అత్యధిక మార్కులు సాధించి పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలిచినందుకు గ్రామస్తులు అభినందించారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీటీసీ మోర్తా బీమా బాయ్, కో ఆప్షన్ సభ్యులు కురాటి శ్రీకృష్ణ, వైసిపి నాయకులు పెంకె అర్జున్, తాతయ్య నానమ్మలు నరసింహమూర్తి, రాజమ్మ విద్యార్థిని షర్మిలను అభినందించి సాలువాతో ఘనంగా సత్కరించారు. ఉన్నత చదువుల్లో కూడా రాణించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని వారు కోరారు.