విశాఖపట్నం: విశాఖ కెన్నెల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాగ్ షో, 42 జాతులకు చెందిన 260 సునకాలు పాల్గొన్నాయి
సాగర్ తిరుమల ఏర్పాటు చేసిన డాగ్స్ షో అందరినీ అలరించింది.విశాఖ కిన్నెల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 260 పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. దేశ విదేశాల నుంచి వచ్చిన 42 జాతులకు చెందిన సునకాలు ఇందులో హొయలు ఓలికించ్చాయి. సునకాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని విశాఖలో గతంలో జరిగిన అన్నిటికంటే దీనికి ఎక్కువ స్పందన వచ్చిందని తెలిపారు. జాతీయస్థాయిలోని నిర్వహించిన డాగ్ షో కూడా ఇంత రెస్పాన్స్ రాలేదు అన్నారు. భారీగా సునక ప్రియులు పాల్గొనడం పట్ల నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు.