జిల్లాలో ఆరోగ్య ప్రమాణాలను అగ్రస్థానంలో నిలిపేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. పీజీఆర్ఎస్ హాల్లో ఏఎన్సి రిజిస్ట్రేషన్, వ్యాక్సినేషన్, మలేరియా–డెంగ్యూ పరిస్థితులపై ఆయన సమీక్ష నిర్వహించారు.ప్రసూతి మరణాలు ఎక్కడా జరగకుండా పీహెచ్సీల్లో సరిపడ మందులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రక్తహీనత నివారణ, తల్లి–శిశు ఆరోగ్య సేవల్లో పురోగతి సాధించేందుకు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది కలిసి పనిచేయాలని ఆదేశించారు.మలేరియా, డెంగ్యూ హాట్స్పాట్లను గుర్తించి తక్షణ నివారణ చ