పల్నాడు జిల్లా కలెక్టరేట్లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
పల్నాడు జిల్లా కలెక్టరేట్లో ఓ వ్యక్తి గడ్డి మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో నరసరావుపేట మండలం జొన్నలగడ్డ కు చెందిన చెట్టు బ్రహ్మయ్యకు 50 గజాల స్థలం వివాదంలో అధికారులు తనకు న్యాయం చేయడం లేదంటూ పంచాయతీ కార్యదర్శి శివనాగేశ్వరరావు తనకు చెందిన స్థలంలో వేరే వారి పేరు మీద రాశారంటూ బాధితులు ఆరోపించారు. ఎన్నిసార్లు అధికారులకు వద్ద మొరపెట్టుకున్న పరిష్కారం కాకపోవడంతో మనస్థాపన చెంది ఆత్మహత్యాయత్నం చేసినట్లు బాధితులు పేర్కొన్నారు.పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బ్రహ్మయ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు