అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని బళ్లారి బైపాస్ వద్ద టీవీఎస్ షోరూం సమీపంలో ఆటో ను ఢీకొన్న కారు, ఇద్దరికీ తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Jul 6, 2025
అనంతపురం నగరంలోని బళ్లారి బైపాస్ వద్ద ఉన్న టీవీఎస్ షోరూం సమీపంలో ఆటోను కారు ఢీకొన్న సంఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో షర్ఫుద్దీన్ తో పాటుగా రఫీక్ అనే ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ అనంతపురం ప్రభుత్వ సర్వేజనా ఆసుపత్రికి 108 సహాయంతో తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.