నాగులుప్పలపాడు లో రోడ్డు భద్రత నియమాలపై రోడ్ సేఫ్టీ వారియర్స్ తో కలిసి ఎస్సై రజియా సుల్తానా గురువారం అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ... ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లు మరియు టాక్సీలో ప్రయాణించేవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలన్నారు. అలా చేయడం ద్వారా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయం నుండి సురక్షితంగా తప్పించుకోవచ్చని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడపవద్దని హెచ్చరించారు. రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని అన్నారు.