వికారాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు అంకితభావంతో పని చేసినప్పుడే విధి నిర్వహణలో సంతృప్తి కలుగుతుంది: జిల్లా అదనపు కలెక్టర్ లింగ్య నాయక్
వికారాబాద్ జిల్లా డిపిఆర్ఓ ఆరిఫుద్దీన్ గద్వాలకు బదిలీపై వెళ్లిన సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో పాత్రికేయులు ఏర్పాటుచేసిన వీడ్కోలు సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఆధనం కలెక్టర్ లింగ్య నాయక్ వచ్చి ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో అధికారులు పాత్రికేయులు తో సమన్వయం పరుచుకొని ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు ప్రజలకు అందించడంలో డిపిఆర్ఓ అరిఫుద్దీన్ కృషి అభినందనీయం అని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అంకితభావంతో పనిచేసినప్పుడే విధి నిర్వహణలో సంతృప్తి కలిగిస్తుందని అన్నారు.