మర్రిగూడ: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే గేదె మృతి చెందింది: బాధిత రైతు దూసరి పండు
నల్గొండ జిల్లా, మర్రిగూడ మండల పరిధిలోని కుదాబక్షుపల్లిలో విద్యుత్ షాక్ తో గురువారం సాయంత్రం గేదె మృతి చెందింది. బాధిత రైతు దూసరి పండు తెలిపిన వివరాల ప్రకారం.. తన గేదెను రోజువారి మాదిరిగా మేత మేపేందుకు పొలం వద్దకు తీసుకెళ్లగా అక్కడ దిగిపడి ఉన్న విద్యుత్ తీగకు ప్రమాదవశాత్తు గేద తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే గేదె మృతి చెందిందని బాధిత రైతు ఆరోపించారు. నష్టపోయిన గేద విలువ సుమారు రూ.80 వేలు ఉంటుందని, ఇతరులు ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.