కర్నూలు: చదువుతోనే సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి: కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు
చదువుతోనే సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు కర్నూలు నగరంలోని సంపత్ నగర్ లో గల ఉర్దూ రెసిడెన్సియల్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన చిల్డ్రన్స్ ఫెస్టివల్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధి గా పాల్గొన్నారు..ఈ సందర్బంగా కళాశాలలో నూతన కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించిన ఎంపీ, విద్యార్థులు తయారు చేసిన సైన్స్ పరికరాలను తిలకించారు...ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు కుటుంబానికి చెందిన తాను చదువుకోవడానికి ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకున్నానన్నారు.. ప్రతి ఒక్కరు పట్టుదలతో చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు.