కావలి: దగదర్తి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
దగదర్తి మండలం సున్నంబట్టి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కసుమూరు నుంచి ఒడిశాకు బస్సులో వస్తున్న ఓ ప్రయాణికుడు డాబా వద్ద మలవిసర్జనకు దిగాడు. ఈ క్రమంలో నెల్లూరు నుంచి కావలి వైపుగా వెళుతున్న కారు ఢీకొనడంతో ఆయన మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటన శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో జరిగింది.