ఆళ్లగడ్డ: కోటకందుకూరు మెట్ట హైవేపై ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు ముందు బాగా నుజ్జు నుజ్జు ఆరుగురికి గాయాలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం కోట కందుకూరు మెట్ట వద్ద హైవే పై రోడ్డు బుధవారం ప్రమాదం జరిగింది, ఆళ్లగడ్డ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును హైదరాబాద్ నుంచి కడప వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది, ఈ ప్రమాదంలో బస్సు వెనుక భాగాన్ని కారు ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది, కారులో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు, క్షతగాత్రులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా సమాచారం, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు